శాంపుల్ దందా...

- నమూనా మందుల విక్రయం
- నిబంధనలకు నీళ్లొదిలిన వ్యాపారులు
- అయిజ కేంద్రంగా జోరుగా వ్యాపారం
- 74 రకాల మందులు పట్టుబడిన వైనం
అలంపూర్, జనవరి 9 : శాంపిల్ మం దులను విక్రయించరాద న్న నిబంధనలు పట్టించుకోవ డం లేదు. వాటిని మెడికల్ షాపు ల్లో ఇష్టారీతిగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మందుల తయారీ కంపెనీ ప్రతినిధుల ద్వారా ప్రచార ని మిత్తం ఉచితంగా సరఫరా అయిన శాం పిల్ మందులను వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇచ్చి అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఔషధ నియంత్రణ శాఖ దాడులు నిర్వహించి పలు కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా కొన్నిచోట్ల దుకాణాదారులను హెచ్చరించారు. చాలా చోట్ల శాంపిల్ మాత్రలు అమ్ముతున్నారని బహిర్గతమైంది. గత మంగళవారం అయిజలో గద్వాల డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అనుమతి లేకుండా ఉంచిన దాదాపు 74 రకాల శాంపిల్ మందులను సీజ్ చేశారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని సమాచారం. అయిజలో పట్టుబడిన దుకాణంపై ఇదివరకే పలుమా ర్లు కేసులు కావడం గమనార్హం. జిల్లాలో కొన్ని చోట్ల లైసెన్స్ ఒకరి పేర ఉండగా.., మరొకరు దుకాణం నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకాణాల్లో ఉన్న సిబ్బంది కూడా ఫార్మసిస్టుగా గుర్తింపు పొంది ఉండాలి. అయితే ఈ నిబంధనలు ఏమీ పాటించకుం డా అర్హత లేని వారు విధులు నిర్వహిస్తున్నారు.
అయిజ అడ్డాగా..
మందుల విక్రయాలకు సంబంధించిన స్టాక్ పా యింట్ల కోసం అక్రమార్కులు అయిజ పట్టణాన్ని అడ్డా గా మార్చుకున్నారు. క ర్నూల్ నుంచి మందులను త రలించి అయిజలో నిల్వ ఉంచుతున్నా రు. అక్కడి నుంచి కొంతమంది సాయంతో గ్రామీణ ప్రాంత వైద్యులకు విక్రయిస్తున్నారు. మం దుల దుకాణాలు లేని గ్రామాల్లో గ్రామీణ వైద్యులు వాటిని అమ్ముతున్నట్లు సమాచారం. జిల్లాలో గుర్తిం పు లేని గ్రామీణ వైద్యులు అనుభవం లేకున్నా.. వైద్యం అందించి అక్రమం గా సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తుకాగితాలే బిల్లులు..
మందులు కొనుగోలు చేసిన వారికి చిత్తు కాగితాల మీదే బిల్లులు వేసి డబ్బులు తీసుకుంటున్నారు. చాలా దుకాణాల్లో బిల్లింగ్ చేసే కంప్యూటర్లు లేవు. కొన్ని చోట్ల ఉన్నా కంప్యూటర్ బిల్లులు ఇవ్వడం లేదు. మందుల బిల్లులు తెల్ల కాగితం రాసి ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్లు వేసిన తెల్ల కాగితం కూడా వినియోగదారులకు ఇవ్వడం లేదు. స్లిప్ మందులు కాకుండా విడిగా కొనాల్సి వచ్చినప్పుడు.. అధిక ధరలు తీసుకుంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారుగా 200 మందుల దుకాణాలు ఉండగా, మండల కేంద్రాల్లో ఉండే వాటిలో మెడికల్తో పాటు జనరల్ వస్తువులు కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు పాటించాల్సిందే..
మందుల దుకాణాల్లో ని బంధనలు పాటించకుం టే కచ్చితంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుం టాం. ఇప్పటికే కొన్ని దుకాణాలపై కేసులు నమోదు చేశాం. కే సులు పునరావృ తం అయితే దుకాణాలను సీజ్ చేస్తాం. శాంపిల్ మందులను విక్రయించొద్దు. మందులు కొన్న వారికి బిల్లులు ఇవ్వా లి. అర్హత ఉన్న వారిని మాత్రమే దుకాణాల్లో నియమించుకోవాలి.
- శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్, జోగుళాంబ గద్వాల