Gadwal
- Jan 09, 2021 , 00:19:15
VIDEOS
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి, జనవరి 8 : అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే అబ్రహం సమక్షంలో 100మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. బుడమర్సు గ్రామ సర్పంచ్ తిమప్ప, ఎంపీటీసీ చిన్న గిడ్డయ్య, ఉపసర్పంచ్ శ్రీలక్ష్మి, ముగ్గురు వార్డు సభ్యులు, 100మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడంతో ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం పీఆర్టీయూ నూతన సంవత్సర డైరీని ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING