సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 08, 2021 , 00:26:29

జీవితంలో ఎదగాలంటే కష్టపడాలి

జీవితంలో ఎదగాలంటే కష్టపడాలి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాలటౌన్‌, జనవరి 7: జీవితంలో ఎదగాలంటే కష్టపడాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇంటర్‌ బోర్డు ఆధ్వర్యంలో రెండు నెలలుగా  ఇస్తున్న ఉచిత పోలీస్‌ శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత మెటీరియల్‌ను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి లక్ష్యం ఉండాలని,  విద్యాభివృద్ధికి తనవంతు కృషి ఎప్పటికీ ఉంటుందన్నారు. గతంలో కూడా డీఎస్సీ, పోలీస్‌ కోచింగ్‌ను ఉచితంగా ఇప్పించామని గుర్తుచేశారు. అనంతరం  ఇంటర్‌ నోడల్‌ అధికారి మాట్లాడుతూ  బాలికల జూనియర్‌ కళాశాల నిర్మాణానికి కోటి యాభై లక్షల రూపాయాలు మంజూరయ్యాయని , మహిళా డిగ్రీ కళాశాల ప్రహరీ నిర్మాణానికి రూ.70లక్షలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధునీకరణకు రూ.80లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, డిగ్రీ, ఇంటర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీపతినాయుడు, దేవేందర్‌రెడ్డి, కో ఆర్డినేటర్‌ వీరన్న, ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ ఆనం ద్‌, పీఈటీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, అధ్యాపకులు, పీఈటీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo