ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 07, 2021 , 00:35:27

వైభవంగా రథోత్సవం

వైభవంగా రథోత్సవం

గద్వాలటౌన్‌, జనవరి 6 :  సంస్థానాదీశుల ఇలవేల్పుగా..భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా విరాజిల్లుతున్న సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. మూడు రోజులుగా ఉత్సవాలను సంస్థానాదీశుల వంశస్తులు, ఆలయ ధర్మకర్తలు సంయుక్తమ్మ, ప్రకాశ్‌రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 11గంటలకు స్వామి వారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చివరి రోజు బుధవారం ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా స్వామి వారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యహోమం , పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి తీర్థావలి, నాగవల్లి, పూర్ణాహుతి దేవతా విసర్జన  పూజలను వంశపారంపర్య ఆలయ అర్చకులు పవన్‌చారి, రాఘవచారి నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. 

VIDEOS

logo