సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 07, 2021 , 00:34:46

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ధరూర్‌,జనవరి 6 :  ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.  మండలంలోని నర్సన్‌దొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయాన్ని బుధవారం ఎమ్మెల్యే దంపతులు  ప్రారంభించి విగ్రహా ప్రతిష్ఠాపన చేశారు. ముందుగా శివలింగం, అనంతరం ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు అందరిలో ఐక్యత భావాన్ని పెంపొందిస్తాయన్నారు. అంతకుముందు  సర్పంచ్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కేటీఆర్‌ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సర్వారెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, గోవర్ధన్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, యూత్‌ సభ్యులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

 నిధులు కేటాయించాలి

గద్వాల,జనవరి 6 : మార్కెట్‌ యార్డులో పనిచేస్తున్న గుమాస్తాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి హాల్‌ నిర్మించాలని, దానికి సంబంధించిన నిధులు కేటాయించాలని కోరుతూ యూనియన్‌ నాయకులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌కి వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే హాల్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుమాస్తాల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి వెంకటేశ్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి జయరాములు, స భ్యులు మహేశ్‌, శ్రీనివాసులు, కౌన్సిలర్లు నరహరిగౌడ్‌, శ్రీనివాసులు టీఆర్‌ఎస్‌ నాయకులు తిమ్మన్న ఉన్నారు.

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు వెల్లువ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ, ఇంటర్‌నోడల్‌ అధికారి హృదయరాజు, ఎంఈవోలు ప్రతాప్‌రెడ్డి, రాజు, సురేశ్‌, ప్రిన్సిపాల్‌ వీరన్న, దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌, డైరీని ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ కేశవ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శ్రీమన్నారాయణ ఉన్నారు.

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దంపతులు పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు అందజేయాలని ఎమ్మెల్యేను కోరి ఎమ్మెల్యేకు నోట్‌ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో గంజిపేట యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం అందజేత

మల్దకల్‌, జనవరి 6 : మండలంలోని మద్దెలబండ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కుర్వ ఆంజనేయులు మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి బుధవారం గ్రామానికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు అజయ్‌, నారాయణ, రామకృష్ణ, సంతోష్‌ ఉన్నారు.


VIDEOS

logo