మూడు రిజర్వాయర్లు పూర్తి చేయించాలి

వడ్డేపల్లి, జనవరి 2: తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు వల్ల ఎంతో మేలు చేకూరిందని అదే విధంగా మూడు రిజర్యాయర్లు త్వరితగతిన పూర్తి చేయించాలని కోరుతూ ఆర్డీఎస్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి ఎమ్మెల్సీ కవితను కోరారు. శనివారం హైదరాబాద్‌లో ఆమెను కలసి సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను పూర్తి చేస్తే సగంమంది రైతులకు సాగునీరు అందు తుందని, అందుకు కృతజ్ఞతగా కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రైతులకు ఇంకా ఐదురోజులు నీళ్లు ఇవ్వాల్సి వుండగా నీళ్లు ఉన్నా ఆర్డీఎస్ అధికారులు ఇవ్వడంలేదని, కర్నూలుకు ఇస్తామని చెబుతున్నారని, దీంతో రైతుల పంటలు ఎండిపోతున్నా యని ఆమెకు వివరించారు. ప్రాజెక్ట్ చైర్మన్ నియామకం చేపట్టాలని, గతంలో పనిచేసిన అనుభవం తనకు వుందని తాను రైతుల పక్షాన నిలబడి సేవలందిస్తున్నాన్నారు. కార్యక్రమంలో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్