బుధవారం 03 మార్చి 2021
Gadwal - Jan 01, 2021 , 03:37:23

రైతు సంబురాలకు వ్యవసాయశాఖ మంత్రికి ఆహ్వానం

రైతు సంబురాలకు వ్యవసాయశాఖ మంత్రికి ఆహ్వానం

గద్వాల, డిసెంబర్‌ 31: మల్దకల్‌లో స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు  అఖిలభారత ఒంగోలు జాతి పోషక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో  రైతు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు   ముఖ్య అతిథిగా  హాజరుకావాలని జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామేశ్వరి కలిసి వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు. మంత్రిని కలిసిన వారిలో మల్దకల్‌ ఎంపీపీ రాజారెడ్డి, నాయకులు సీతారామిరెడ్డి, అజయ్‌, తిమ్మన్న ఉన్నారు.

రైతు సంబురాల బ్రోచర్‌ విడుదల

జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు జరిగే రైతు సంబురాల బ్రోచర్‌ను ఎంపీపీ రాజారెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌లు సుభాన్‌, తిమ్మారెడ్డి మల్దకల్‌ జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల చేశారు.కార్యక్రమంలో మల్దకల్‌ సర్పంచ్‌ యాకోబ్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు రామచంద్రారెడ్డి, సత్యారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, అజయ్‌  తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo