మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Dec 31, 2020 , 00:52:22

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోండి

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోండి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల: పేదల వైద్య ఖర్చుల నిమి త్తం ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయాన్ని ప్రజలు సద్వినియో గం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో గట్టు మండలం తుమ్మల చెరువు గ్రామానికి చెందిన చిన్నకు కాళ్ల ఆపరేషన్‌ కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష ఎల్‌వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ-టీఎస్‌, ఎస్‌జీటీ 2021 క్యాలెండర్‌ ఆవిష్కరణ

 జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పీఆర్‌టీయూ-టీఎస్‌,ఎస్‌జీటీ 2021 క్యాలెండర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ జీపీఎఫ్‌ విభాగంలో జిల్లాకు సంబంధించి క్లర్క్‌ లేనందువల్ల  లోను షెడ్యూల్‌ తయారు కావడం లేదని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అందుకు స్పందించిన ఎమ్మెల్యే మహబూడ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డితో మాట్లాడి సెక్షన్‌ క్లర్క్‌ ఏర్పాటుకు కృషి చేయడంతో పీఆర్‌టీయూ నాయకులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo