శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Dec 31, 2020 , 00:47:21

నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే అబ్రహం

ఉండవెళ్లి : అలంపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్‌ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అలంపూర్‌, మానవపాడు, ఉండవెళ్లి మండలాల చెందిన 24మంది లబ్ధిదారులకు రూ.24లక్షల 2వేల 748ల కల్యాణలక్ష్మి చెక్కులు  ఎమ్మెలే బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అలంపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ్మ, ఎంపీపీ బీసమ్మ, ఆలయ కమిటీ చైర్మన్‌ రవికుమార్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామ్‌దేవ్‌రెడ్డి, తాసిల్దార్‌ మదన్‌మోహన్‌, లక్ష్మి, వరలక్ష్మి,  సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కలసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

వడ్డేపల్లి : పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. శాంతినగర్‌లోని ప్రధాన రోడ్డు పక్కన నూతనంగా వెలసిన సులభ్‌కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. అయితే ఈ కాంప్లెక్స్‌ను మొదట చైర్‌పర్సన్‌ కరుణ, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించగా, వెంటనే కాంగ్రెస్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత తన కౌన్సిలర్లు, నాయకులతో కలసి రెండో సారి ప్రారంభించడం విశేషం. కార్యక్రమంలో  ఎంపీపీ రజితమ్మ, జెడ్పీటీసీ కాశపోగురాజు,  కౌన్సిలర్లు  ఆంజనేయులు, సుజాత నాయకులు మాణిక్యం రవి, సీతారామిరెడ్డి, గోపాల్‌ రెడ్డి, వడ్డేపల్లి సూరి, దేవేంద్ర, రాజు, గడ్డం శ్రీను, డీలర్‌ శ్రీను, తిమ్మప్ప, పున్నారావు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo