మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

- కలెక్టర్ శృతిఓఝా
గద్వాల : మల్దకల్ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని కోనేటిలో విద్యుదాఘాతానికి గురై మరణించిన ఆలయ ఉద్యోగి కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ శృతిఓఝా అన్నారు. బుధవారం జిల్లా ఏరియా దవాఖాన వద్ద మృతుడు నర్సింహ భార్య శివమ్మను ఓదార్చి ఆమె కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా వచ్చే అన్ని బెనిఫిట్స్ అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారని వారికి చేయూత నిచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రాములు, మల్దకల్ తాసిల్దార్ ఆజంఅలీ, ఎంపీడీవో రాజారమేశ్ ఉన్నారు.
నర్సింహ మృతి బాధాకరం : ఎమ్మెల్యే
మల్దకల్ ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి విద్యుత్‌షాక్‌తో మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో నర్సింహ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున నర్సింహ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.
విద్యుదాఘాతంతో ఆలయ ఉద్యోగి మృతి
మల్దకల్ : విద్యుదాఘాతంతో ఆలయ ఉద్యోగి మృతిచెందిన సంఘటన మల్దకల్ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలోని కోనేరులో బుధవారం చోటు చేసుకున్నది. ఎస్సై శేఖర్ కథనం ప్రకారం లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా భక్తుల స్నానాలకు గానూ ప్రత్యేకంగా షెవర్లు ఏర్పాటు చేశారు. అయితే షెవర్లకు నీరు రాకపోవడంతో ఆలయం ఉద్యోగులు నర్సింహ(35)తో పాటు మరొకరు పెద్ద నర్సింహులు కోనేరులోకి దిగి మోటర్‌ను నీటిలో లాగటానికి ప్రయత్నించారు. అయితే నీటిలో దిగిన నర్సింహకు వైర్లను లాగుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై కోనేరులో పడ్డాడు. వెంటనే తేరుకొని పెద్ద నర్సింహులు బయటవచ్చాడు. ఆలయ సిబ్బంది ప్యూజ్‌లు తీసివేసి నీటిలో పడిన నర్సింహను బయటకు తీసి చికిత్స నిమిత్తం గద్వాల దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
తాజావార్తలు
- మోసాలకు పాల్పడుతున్న ముఠాల అరెస్ట్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- లగ్జరీ కారులో రయ్యిమంటూ దూసుకుపోతున్న అల్లు అర్జున్
- ఆన్లైన్లో భద్రాద్రి రామయ్య కల్యాణం టికెట్లు
- ఇక స్కూళ్లల్లోనూ ఇంటర్ పరీక్ష కేంద్రాలు
- లాస్యతో కుమార్ సాయి స్టెప్పులు... వీడియో వైరల్
- తిరుపతి మార్గంలో 18 రైళ్లు రద్దు: ఎస్సీఆర్
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు