ఫిబ్రవరి 1 నుంచి డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల : నిరుద్యోగులకు చేయూత నిచ్చి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలనే ఉద్ధేశంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టెట్ పేపర్-1,2తోపాటు డీఎస్సీ అభ్యర్థులకు మంచి అనుభవం కలిగిన ఆధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచిత పోలీస్ శిక్షణ ఇప్పించామని అప్పుడు సుమారు పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల్లో సుమారు 60కి పైగా ఉద్యోగాలను ఈ ప్రాంత నిరుద్యోగులు సాధించారని అదే స్ఫూర్తితో ప్రస్తుతం ఆర్థికంగా వెనుక బడిన నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ నిరుద్యోగులకు ఇక్కడే ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైనా మెటీరియల్ అందిస్తామని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిక్షణ పొందాలనుకునే వారు జనవరి 18 నుంచి 28 తేదీవరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1 తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని సుమారు 90రోజుల పాటు నిరుద్యోగ యువకులకు కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ కోచింగ్ సెంటర్లలో పని చేస్తున్న అనుభవం కలిగిన ఆధ్యాపకులచే కోచింగ్ ఇపిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ కోచింగ్‌లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
తాజావార్తలు
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ
- ఆ డీల్ కుదరకపోతే 11 లక్షల ఉద్యోగాలు పోయినట్లే!
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు