మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Dec 28, 2020 , 09:17:20

సైనికా.. సెలవికా

సైనికా.. సెలవికా

  • ఆర్మీ జవానుకు కన్నీటి వీడ్కోలు
  • అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
  • హాజరైన మంత్రి, ఎమ్మెల్యేలు 

 ఆర్మీ హవల్దార్‌ పరశురాంకు కన్నీటి వీడ్కోలు పలికారు. కశ్మీర్‌లోని లఢక్‌ జిల్లా లేహ్‌ ప్రాంతంలో గురువారం రాత్రి  ప్రమాదవశాత్తు మృతి చెందగా.. శనివారం రాత్రి  మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆదివారం గండీడ్‌ మండలం గువ్వనికుంట తండాలో  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు,  సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకులు బైక్‌ ర్యాలీ  నిర్వహించి జై జవాన్‌ అంటూ నినదించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌,  ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, అబ్రహం హాజరై నివాళులర్పించారు.  పరశురాం కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

   - గండీడ్‌

గండీడ్‌: ఆర్మీ జవాన్‌ పరశురాం అమర్‌హై.. జై జవాన్‌ అంటూ దారి పొడవునా నినాదాలు హోరెత్తాయి. ఈనెల 26న కశ్మీర్‌లోని లఢక్‌ జిల్లా లేహ్‌ ప్రాంతంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గండీడ్‌ మండలం గువ్వని కుంట తండాకు చెందిన ఆర్మీ జవాన్‌ (హవల్దార్‌) పరశు రాంకు కన్నీటి వీడ్కోలు పలికారు. శనివారం రాత్రే మృత దేహం సొంత గ్రామానికి చేరుకోగా ఆదివారం ఉదయం 10:20 నిమిషాలకు అంతిమయాత్ర ప్రారంభమవగా మధ్యా హ్నం 12:55 గంటలకు పరశురాం చితికి తమ్ముడు బాలు నిప్పంటించాడు. అధికార లాంఛనాలతో అధి కారులు అంతిమ యాత్ర నిర్వహించారు. మృతుడి భార్య, పిల్లలు, బంధువుల రోధ నలు మిన్నంటాయి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పరిగి, అలంపూర్‌ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, అబ్రహం గ్రామాని కి చేరుకొని పరశురాం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మృతుడి కుటుం బాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే మహేశ్‌ పాడెమోశారు. అంతిమ కార్యక్రమాలను దగ్గరుం డి చేశారు. వివిధ గ్రామాల నుంచి యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతీయ జెండాలు చేతబట్టి బైక్‌ ర్యాలీగా తండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జైజవాన్‌ అనే నినాదాలతో తండా మార్మోగింది. నారాయణ పేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని చంద్రబోస్‌ డిఫెన్స్‌ అకడామీ విద్యార్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

కుటుంబ నేపథ్యం

పరశురాంది పూర్తిగా వ్యవసాయ కటుంబం. తల్లి కమ్లి బాయి, తండ్రి గోబ్య్రానాయక్‌కుల మొదటి సంతానం పరుశు రాం. రెండో సంతానం  బాలు. తండ్రి ఇదివరకే మృతి చెందాడు. పరశురాంకు భార్య శాంతి, కూతురు భార్గవి, కొడుకు కునాల్‌ చౌహాన్‌ ఉన్నారు. పరుశురాం 2004లో ఆర్మీలో  చేరాడు. అప్పటినుంచి కొంత మేర కుటుంబం సాఫీగా  సాగింది. వీరికి రెండు ఎకరాల భూమి ఉంది. అందులోనే వ్యవసా యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

పాలమూరు బిడ్డ మృతి బాధాకరం : మంత్రి

దేశ రక్షణలో విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకున్న పరశురాం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం గువ్వనికుంట తండాలో విలేకరుల తో మాట్లాడారు. మృతుడి బిడ్డల చదువుకు సహకరిస్తామ న్నారు. ప్రభుత్వపరంగా తక్షణ సాయంగా రూ.25 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. పాలమూరులో డబుల్‌ బెడ్రూం ఇల్లు, అర్హతను బట్టి భార్య శాంతికి ఉద్యోగం ఇప్పి స్తామన్నారు. అంతిమయాత్రలో అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామారావు, తాసిల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo