గురువారం 04 మార్చి 2021
Gadwal - Dec 25, 2020 , 00:22:30

మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయాలి

మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయాలి

  • అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష
  • మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పరిశీలన  

అయిజ : మున్సిపాలిటీలో ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గురువారం పట్టణంలో  అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ. 29.43కోట్ల వ్యయంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పనులు చేపట్టిందన్నారు.  పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి,  సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉప్పల రోడ్డు నుంచి ఉప్పలదొడ్డిపేట మీదుగా పీహెచ్‌సీ వరకు చేపట్టిన బీటీ, సీసీ రహదారితోపాటు కల్వర్టుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన నర్సరీ పనులు పూర్తి  చేసి మొక్కలను సిద్ధం చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్‌ గోపాల్‌, పంచాయతీరాజ్‌ డీఈ ఆంజనేయులు, కాంట్రాక్టర్‌ కృష్ణమూర్తి  పాల్గొన్నారు. 


VIDEOS

logo