బాస్కెట్‌బాల్ క్రీడకు అత్యాధునిక వసతులు

- త్వరలో ఉత్తనూరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్
- బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిషన్ చైర్మన్ నార్మన్ ఐజాక్
అయిజ : రాష్ట్రంలోని మారుమూల గ్రామమైన ఉత్తనూర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో బాస్కెట్‌బాల్ కోర్టును ఏర్పాటు చే యడం గర్వించదగ్గ విషయమని బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిషన్ చైర్మన్, తెలంగాణ బాస్కెట్‌బాల్ ప్రధాన కార్యదర్శి నార్మన్ ఐజాక్ అన్నారు. బుధవారం మండ లంలోని ఉత్తనూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసి న బాస్కెట్‌బాల్ కోర్టును ఆయన పరిశీలించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు సరిహద్దుగా ఉన్న ఉత్తనూర్‌లో బాస్కెట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి ని అభినందించారు. త్వరలోనే ఉమ్మడి రాష్ట్ర బాస్కెట్‌బాల్ టో ర్నమెంట్ను ఇక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తె లిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కోర్టును నిర్మించారన్నారు. రూ.కోటి వ్యయంతో పాఠశాలలో మౌలిక వసతులతోపాటు ఇన్నోవేషన్ ల్యాబ్, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కిచెన్ గార్డెన్, భోజనశాల వంటి సౌకర్యాలు క ల్పించారన్నారు. కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, కోచ్ నయీముద్దీన్, హెచ్ఎం తిమ్మారెడ్డి, కౌ న్సిలర్ నర్సింహులు, రిటైర్డ్ వీఆర్వో రామచంద్రారెడ్డి, నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మైబు, ఖాజా ఉన్నారు.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!