సోమవారం 01 మార్చి 2021
Gadwal - Dec 23, 2020 , 04:47:43

దేవుడొక్కడే కొలిచే మార్గాలు వేరు

దేవుడొక్కడే కొలిచే  మార్గాలు వేరు

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్‌ : ఏమతమైనా, ఏ కులమైనా ఎన్ని మార్గాల్లో మనం దేవుడిని ప్రార్థించిన అందరి దేవుడొక్కరేనని, మనం కొలిచే మార్గాలే వేరని  జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం అన్నారు. మంగళవారం అలంపూర్‌ మండల కేంద్రంలో న్యూప్లాట్స్‌ కాలనీలోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలకు సమానంగా పథకాలు వర్తింపజేస్తుందన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేకు క్రైస్తవ పెద్దలు శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్‌ సూపరింటెండెంట్‌ చంద్ర శేఖర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, పీఏసీసీఎస్‌ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఇమాంపురం మద్దిలేటి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, కౌన్సిలర్‌ సుదర్శన్‌గౌడ్‌, సుదర్శనమ్మ, వెంకట్రామయ్యశెట్టి, జాన్‌, శీను, శేఖర్‌, ఆర్‌ఐ కరీం, శ్రీవాణీ, మాజీ సర్పంచ్‌ జయరాముడు, హాజీ వలి, పాస్టర్లు ఎలీసా, భాస్కర్‌ తదితరులు  పాల్గొన్నారు.

మట్టి తరలింపును ఆరికట్టాలని వినతి

అలంపూర్‌ : మండలంలోని ర్యాలంపాడు గ్రామం నుంచి  ప్రభుత్వ పనుల పేరుతో తరలిస్తున్న మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని సర్పంచ్‌ కుబ్రాబీ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం అందజేశారు.  అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ శివారులో చేపడుతున్న పనులకు సర్పంచుకు సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.


VIDEOS

తాజావార్తలు


logo