ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 22, 2020 , 00:42:47

రైతు కుటుంబాలకు చేయూత

రైతు కుటుంబాలకు చేయూత

  •  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల: రైతు కుటుంబాలకు చేయూతనివ్వడానికే ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మహదేవ్‌ అనారోగ్యంతో మరణించగా, ఆయన కుమారుడు సహదేవ్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల రైతుబీ మా చెక్కును సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు గోపిరెడ్డి, రాజేశ్‌, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo