ఉల్లంఘనులపై కొరడా..

- ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే జరిమానా
- రూల్స్ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని సూచన
- అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు
గద్వాల క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వాహనదారులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేకుండా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ బైక్ నడిపిన వారిపై జరిమానాలు విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. గద్వాల పట్టణంలోని ధరూర్ మెట్టు, అయిజ రోడ్డు, పాతబస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, గాంధీచౌక్ తదితర ముఖ్య కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఇన్సూరెన్స్ వంటి ధ్రువపత్రాలు లేకున్నా, హెల్మెట్ లేకున్నా, మైనర్లు వాహనాలు నడిపినా, వేగంగా వెళ్లినా పోలీసులు జరిమానా విధిస్తున్నారు. రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయకుండా నిబంధనలను కఠినతరం చేశారు. నో పార్కింగ్ చోట వాహనాలు నిలిపితే ఈ చలాన్ రూపంలో జరిమానా విధిస్తున్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. డబ్బులను సేవ్ చేసుకోవడంతోపాటు ప్రాణాలను కాపాడుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
చలాన్లు ఇలా..
- నూతన మోటరు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.1,000.
- సీట్ బెల్టు వేసుకోకుంటే రూ.1,000.
- సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5,000.
- మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు.
- రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే రూ.5వేలు.
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ వల్ల జరిగే అనర్ధాలపై పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మైనర్లు వాహనాలు నడిపితే సీజ్ చేయడంతోపాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- హరిప్రసాద్ రెడ్డి, ఎస్సై, గద్వాల టౌన్
తాజావార్తలు
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్