శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 21, 2020 , 01:06:57

ముమ్మరంగా బీటీ రహదారి పనులు

ముమ్మరంగా బీటీ రహదారి పనులు

అయిజ : ఉప్పల రహదారి నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ. 2.50కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఉప్పలదొడ్డిపేట మీదుగా ఉప్పల గ్రామ రహదారి వరకు సీసీ రోడ్డు, కల్వర్టుతోపాటు బీటీ రహదారి పనులకు గతంలో ఎమ్మెల్యే అబ్రహం భూమిపూజ చేసి పనులు ప్రారం భించారు. కరోనా నేపథ్యంలో పనులు కొంత మేరకు ఆలస్యమైనా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఇన్‌చార్జి కమిషనర్‌ గోపాల్‌ పర్యవేక్షణలో ఏఈ సురేశ్‌ బీటీ రహదారి పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి రోడ్డు పనులు చేపడుతున్నారు. ఉప్పల రహదారి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు చేపడుతున్న రహదారి నిర్మాణంతో పట్టణ ప్రజలు కర్నూల్‌, రాయిచూర్‌ పట్టణాలకు వెళ్లేందుకు సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గుత్తేదారు కృష్ణమూర్తి బీటీ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేస్తుండటంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


VIDEOS

logo