శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 21, 2020 , 01:06:57

జోరుగా క్రికెట్‌ టోర్నమెంట్‌

 జోరుగా క్రికెట్‌ టోర్నమెంట్‌

అయిజ : క్రిస్మస్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అయిజ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమీపంలో జై భీం టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 క్రికెట్‌ టీంలు పాల్గొంటున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 15,016 సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు రాముడు, ద్వితీ య బహుమతి రూ. 10,016 మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, మూడో బహుమతి రూ. 7,500 కౌన్సిలర్‌ సీఎం సురేశ్‌ నగదు అందజేయనున్నట్లు జై భీం టీం నిర్వాహకులు తెలిపారు. మ్యా న్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు రూ.1,016, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు రూ. 1,016, హ్యాట్రిక్‌ సిక్స్‌కు రూ. 116, హ్యాట్రిక్‌ వికెట్స్‌ రూ. 116ల నగదు బెంజిమెన్‌ రాజు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

VIDEOS

logo