ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Dec 21, 2020 , 00:56:43

టూరిజం హబ్‌గా అలంపూర్‌ క్షేత్రం

టూరిజం హబ్‌గా అలంపూర్‌ క్షేత్రం

  • సెంట్రల్‌ టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షి శర్మ

అలంపూర్‌: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూ ర్‌ క్షేత్రం టూరిజం హబ్‌గా మారనున్నదని, త్వరలో రూ.37 కోట్లతో ప్రసాద్‌ స్కీం నిధులతో పనులు ప్రారంభించను న్నట్లు సెంట్రల్‌ టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ మీనాక్షి శర్మ అన్నారు. ఆదివారం అలంపూర్‌ క్షేత్రాన్ని ఆమె అధికారులతో కలిసి సంద ర్శించారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది వంతెన పరిసరాలు, నవబ్రహ్మ ఆలయాలను, పరిసరాలు, పుష్కరఘాట్‌, వాహన పార్కింగ్‌ స్థలం, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. స్కీంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. యాత్రికులకు కావాల్సిన అన్ని సౌక ర్యాలు కల్పించి రాష్ట్రంలో చెప్పుకోదగిన ప్రాంతంగా తీర్చిది ద్దడానికి కృషి చేస్తామన్నారు.

నదిలో బోటింగ్‌ సౌకర్యం, సోలా ర్‌ లైట్లు, అన్నదాన సత్రం, వాహన పార్కింగ్‌, ఆలయాల సము దాయాన్ని సందర్శించడానికి అనువైన మార్గం, ఎంట్రన్స్‌ ప్లా జా, సమాచార బోర్డులు, హైమాస్ట్‌ లైట్లు, తాగునీటి సౌక ర్యం, సీసీ టీవీ, ల్యాండ్‌ స్కీనింగ్‌, వెండర్‌ షాప్స్‌ ఏర్పాటు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. పురాతన ఆలయాల్లో శిల్పసంపద ఉట్టి పడుతుందని, వాటిని భావిత రాలకు అందించాల్సి బాధ్యత మనపై ఉందన్నారు. అంతకు ముందు శర్మ దంపతులు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ఈవో ప్రేమ్‌కుమార్‌రావు అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారితోపాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శతృక, కన్సల్టెంట్‌ అనన్య, టూరిజం ఎండీ మనోహర్‌, ఎస్‌ఈ సరిత, డీజీఎం శ్రీనాథన్‌, ఆర్డీవో రాములు, తాసిల్దార్‌ మదన్‌మోహన్‌రావు, హరిత హోటల్‌ మేనేజర్‌ శ్రీనివాసరాజు, ఆలయ ధర్మకర్తలు వెంకట్రామయ్యశెట్టి తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo