శనివారం 06 మార్చి 2021
Gadwal - Dec 19, 2020 , 02:56:18

ప్రతి ఒక్కరూ..హాజరుకావాలి

ప్రతి ఒక్కరూ..హాజరుకావాలి

  • ప్రభుత్వ పథకాలను సభ్యులందరికీ తెలపాలి
  • జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత

గద్వాల న్యూ టౌన్‌: జిల్లా పరిధిలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశాల ను ప్రతిఅధికారి హాజరుకావాలని, ప్రభుత్వ పథకాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజెప్పాలని జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత అన్నారు. శుక్ర వారం జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ శృతిఓఝా, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాఖలవారీగా ప్రగతి, అభి వృద్ధి పనులపై అధి కారులతో మాట్లాడా రు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జిల్లా, మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులకు తెలియ పర్చాలని వారి సహకారంతో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొత్తగా ఏర్పడిన మండ లాలకు కొత్తగా దవా ఖానలు నిర్మించాలని కేటీదొడ్డి జెడ్పీటీసీ కోరారు. రాజోళికి అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఎలాంటి సమాచారం లేకుండా డీఈవో సుశీందర్‌రావు హాజరు కాకపో వడంపై ఆమె మండిపడ్డారు.

కలుకుంట్ల వంతెన, గద్వాలలోని ఆర్వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చందునాయక్‌ మాట్లాడుతూ రాజోళి, కేటీదొడ్డి దవాఖా నలకు అంబులె న్సులు ఇచ్చామని, త్వరలో ఓపీ సేవలు మొదలు పెడతామ న్నారు. వడ్డే పల్లి దవాఖాన కోసం ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. కలెక్టర్‌ శృతి ఓఝా మాట్లా డుతూ ఏమైన సమస్యలు ఉంటే పోలీ సులకు, తాసిల్దార్లకు సమాచారం ఇవ్వాల న్నారు. కేటీదొడ్డి, వడ్డేపల్లి, రాజోళి, మల్దకల్‌ జెడ్పీ టీసీలు పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ముషాయిదాబేగం, అధికారులు హనుమంతురెడ్డి, రాజు, నర్సింహులు, ఎంపీపీలు, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo