శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 18, 2020 , 00:29:09

ముమ్మరంగా ఆర్డీఎస్‌ కాల్వ గండి పూడ్చివేత

ముమ్మరంగా ఆర్డీఎస్‌ కాల్వ గండి పూడ్చివేత

అయిజ : ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు పడిన గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఐదు రోజుల కిందట 12వ డిస్ట్రిబ్యూటరీ వద్ద ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలిసిందే. గండిని పూడ్చేందుకు ఆర్డీఎస్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఎగువ నుంచి నీటి విడుదల నిలిపివేశారు. గండి పూడ్చివేతకు నీరు అడ్డంకిగా మారడంతో మోటర్లతో తోడుతున్నారు. గురువారం గండి పడిన ప్రాంతంలో సిమెంట్‌, కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. మొదట కాంక్రీట్‌ పనులు చేపట్టి మట్టితో గండిని పూర్తిగా పూడ్చి.., సిమెంట్‌తో స్లాబ్‌ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తునారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. 

VIDEOS

logo