సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయి

గద్వాల: ప్రతి ఉపాధ్యాయుడికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని అయితే ఆయన విధి నిర్వహణ సమయంలో విద్యార్థులకు అందించిన సేవలే చిరస్థాయిగా నిలిచి పోతాయని ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వఅభ్యసన ఉన్నత పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన రవికుమార్ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకు ముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జ్వోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ దంపతులను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ఇదే పాఠశాల విద్యార్థినని పాఠశాల అభివృద్ధికి రూ.30లక్షలు కేటాయించానని త్వరలో పాఠశాలలు ప్రారంభమైతే అన్ని వసతులు ఆ నిధులతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటి చైర్మన్ శ్రీరాములు, కౌన్సిలర్ శ్రీనివాసులు, కృష్ణ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ సహజమే
నడిగడ్డ : ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమేనని మున్సిపల్ బీఎస్ కేశవ్ అన్నారు. గద్వాల ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో గెజిటేడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రవికుమార్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ బీఎస్ కేశవ్ హాజరై ఉద్యోగ విరమణ పొందిన రవికుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీరాములు, వ్యాయామ ఉపాధ్యాయులు జితేందర్, రమణ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
జాతర ఏర్పాట్లపై సమావేశం
మల్దకల్ : ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో బుధవారం వేద పాఠశాలలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి నిర్వహించనున్న జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఆలయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ చైర్మన్ ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ఎంపీపీ పెద్ద వీరన్న, ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు,.సర్పంచులు యా కో బు, వెంకటేశ్వర్ రెడ్డి నాయకులు సీతారామిరెడ్డి, అజయ్, నరేందర్, బాబురావు, నర్సింహారెడ్డి, మధు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
- డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా నంబర్‌వన్
- నితిన్ నమ్మకాన్ని చంద్రశేఖర్ యేలేటి నిలబెడతాడా..?
- పందులను తరలించారని..
- జ్ఞాపకశక్తిని పెంచే ఆరెంజ్ జ్యూస్
- రూ.100 టికెట్ కొంటే.. కోటి రూపాయల లాటరీ తగిలింది..
- జీఎస్టీపై పోరు: 26న భారత్ బంద్!
- రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ