కార్యదర్శులు అందుబాటులో ఉండాలి

- అదనపు కలెక్టర్ శ్రీహర్ష
అలంపూర్ : గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుగుణకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కార్యదర్శులు పారదర్శకంగా పని చేయాలన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు రైతు కల్లాలు, హరితహారం, నర్సరీల్లో మొక్కల పెంపకం తదితర పనుల్లో వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీ పనుల్లో వేగం పెంచాలి
ఉండవెల్లి : గ్రామాల్లో ఉపాధిహామీ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఉపాధిహామీ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధిహామీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020-21ఆర్థిక సంవత్సరానికి గుర్తించిన ఉపాధి పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించి పనులు కల్పించాలన్నారు. అలాగే రైతు కల్లాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిత్యం గ్రామపంచాయతీల్లో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివరాజ్, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
నర్సరీల్లో పనులు పూర్తికావాలి
మానవపాడు : రెండు రోజుల్లోగా నర్సరీల్లోని బ్యాగుల్లో మట్టి నింపే పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతి కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రెండు రోజుల కిందట పంచాయతీ కార్యదర్శులకు జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చారా లేదా అని ఎంపీవోను ప్రశ్నించగా వివరణ ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ