ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 11, 2020 , 02:45:50

వందశాతం ప్రగతికి పరితపించాలి

వందశాతం ప్రగతికి పరితపించాలి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

కేటీదొడ్డి : గ్రామీణ ప్రగతికి సంబంధించిన పనులు వందకు వందశాతం పూర్తిచేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మనోరమ్మ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుధ్యానికి అధిక నిధులు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా  ముందుకు కదిలిందన్నారు. గ్రామాల్లో రైతువేదికలు, పల్లె ప్రకృతివనం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామం, రైతు కల్లాల ఏర్పాటు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులపై ప్రత్యేకంగా ధృష్టి సారించిందని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు  సహకరించుకుంటూ వంద శాతం పనులు పకడ్బందీగా జరిగే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఏకగ్రీవ తీర్మానం చేయించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, జెడ్పీటీసీ రాజశేఖర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

తూతూమంత్రంగా ..

గట్టు : గట్టు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం గురువారం తూతూమంత్రంగా జరిగింది. సర్పంచులు, ఎంపీటీసీలు కొద్దిమంది మాత్రమే సమావేశానికి హాజ రయ్యారు. దీంతో సమావేశం మొక్కుబడిగా జరిగినట్లని పించింది. ఈ కారణంగా సమస్యలు అడిగేవారు సమావేశంలో కరువయ్యారు. అన్నిశాఖల అధికారులు తమకు సంబంధించిన ప్రగతి నివేదికలకు చదివి వినిపించారు. సమావేశంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత వారిదే నన్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సుమతి, ఎంపీడీవో పాండు, వైద్యాధికారి రాజసింహ, ఎంఈవో కొండారెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo