ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Dec 10, 2020 , 06:16:11

రుణ దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలి

రుణ దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలి

  •  జిల్లా ఇన్‌చార్జి షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి

గద్వాల: ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద 2018-19వ ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం ద్వారా సబ్సిడీ రుణాల కోసం, స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కేటగిరీ  కింద దరఖాస్తు చేసుకొని మంజూరుకాని దరఖాస్తు దారులు, బ్యాంక్‌, మండల పరిషత్‌, పురపాలక కమిషనర్ల లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు గురువారం ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ లాగిన్‌కు కలెక్టర్‌ ద్వారా రుణాల మంజూరు కోసం అప్‌లోడ్‌ చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి అధికారి రమేశ్‌కుమార్‌ బుధవారం ప్రకటనలో కోరారు. అప్‌లోడ్‌ చేయని పక్షంలో సదరు దరఖాస్తులు, మండలాలు, పురపాలక సంఘాల ద్వారా ఎంపిక చేసిన దరఖాస్తుదారుల వివరాలు తొలగించమన్నారు. తొలగించిన దరఖాస్తులు తిరిగి 2020-21 కార్యాచరణ నియమ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి  దరఖాస్తులు 2020-21 కార్యచరణ ప్రణాళికకు రెన్యువల్‌ కావన్నారు. 2020-21 ప్రణాళిక మార్పులు ఉండవచ్చన్నారు. ఎవరైతే ఈఎస్‌ఎస్‌ 2018-19 కార్యాచరణ ప్రణాళిక నియమ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

VIDEOS

logo