బుధవారం 20 జనవరి 2021
Gadwal - Dec 03, 2020 , 02:44:09

కరోనా రెండో దశపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కరోనా రెండో దశపై ప్రజలకు అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రెండో దశపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శృతిఓఝా వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కొవిడ్‌ రెండో దశపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దవాఖానలో కొవిడ్‌ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని వాటి సంఖ్య పెంచాలన్నారు. కొవిడ్‌ రెండో దశలో ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, ఐదేండ్ల లోపు బాల బాలికలు, వ్యాధిగ్రస్తులకు ఇది త్వరగా వ్యాపించే అవకాశం ఉ న్నందున వారికి పరీక్షలు చేయించాలని, వారికి కరోనాపై అవగాహన కల్పించాలని సూచించారు. దీని నివారణ కోసం వందశాతం అందరూ కృషి చేయాలన్నారు. ప్రైవేట్‌ దవాఖానల నుంచి ప్రతి రోజూ సర్వేలైన్స్‌లో భాగంగా తట్టు, పోలియో, రూబెల్ల, డెంగీ, మెదడు వాపు వ్యా ధులకు సంబంధించి సమాచారం తీసుకోవాలని వైద్యా ధికారులకు సూచించారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఓపీలు తక్కువగా ఉన్నాయని వాటిని పెంచాలని సూచించారు. ప్రజలకు వ్యక్తిగత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తే ఓపీ పెరిగే అవకాశం ఉందన్నారు. అందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే వారు ఏ వ్యాధితో బాధపుడుతున్నారో తెలిసిపోతుందని, అందుకు అవసరమైన మందులు వాడి ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా దవాఖానలో శానిటైజేషన్‌ సరిగా లేదని దానిని మెరుగు పర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలంపూర్‌ సీహెచ్‌సీలో విద్యుత్‌ కనెక్షన్ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యే విధంగా చ ర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సివిల్‌ పనులు అన్ని పూర్తి చేయాలని ఆదేశించా రు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో చందూనాయక్‌, పోగ్రాం అధికారి సౌజన్య, డాక్టర్లు శశికళ, వృశాలినితో పాటు వైద్యాధికారులు రామాంజనేయులు, క్రాంతి, విష్ణు, భాగ్యలక్ష్మి, సాధిక్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు

గద్వాల అర్బన్‌ : తుంగభద్ర పుష్కరాలు విజయవంతంగా ముగిసేందుకు కృషి చేసిన కలెక్టర్‌ శృతిఓఝాకు బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు వేణిసోంపురం గ్రామ ఆలయ ప్రసాదాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు మోహన్‌ రావు, నర్సింగరావు ఉన్నారు.logo