శుక్రవారం 15 జనవరి 2021
Gadwal - Dec 03, 2020 , 02:34:31

జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపునకు చర్యలు

జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపునకు చర్యలు

అయిజ : జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకే నట్టల నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్‌ స్వరూపారాణి తెలిపారు. బుధవారం మండలంలోని ఉప్పల, పులికల్‌ గ్రామాల్లో పర్దీపురం గ్రామాల్లో నట్టల నివారణ మందులను జీవాలకు పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు చెందిన 4,862 జీవాలకు నట్టల మందును పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పశువైద్యులు గిడ్డయ్య, సుధాకర్‌ పాల్గొన్నారు. 

జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ

వడ్డేపల్లి : మండలంలోని తనగల, వడ్డేపల్లి గ్రామాల్లో బుధవారం జీవాలకు నట్టల నివారణ మందులను డాక్టర్‌ పుష్పలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తనగల గ్రామంలో ఎంపీపీ రజితమ్మ, నాయకులు సీతారామిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజు 679మేకలకు, 6,321 గొర్రెలకు మందులు పంపిణీ చేశామని పుష్పలత తెలిపారు. 3వ తేదీన కొంకల, వెంకట్రామనగర్‌, 4న జూలేకల్‌, జక్కిరెడ్డిపల్లె, 5న రామాపురం, 7వ తేదీన తిమ్మాజిపల్లె గ్రామాల్లో వైద్య శిభిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వీఎల్‌వో ప్రసాద్‌, రవి, సిబ్బంది పాల్గొన్నారు.

కేటీదొడ్డి మండలంలో..

కేటిదొడ్డి : జీవాలకు నట్టల నివారణ మందులు విధిగా వేయాలని సోంపురం సర్పంచ్‌ తిక్కన్న, గోపాల్‌మిత్ర మోహన్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని సోంపురం గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు తాపారు. కార్యక్రమంలో గోపాల్‌మిత్ర గోపాల్‌రెడ్డి, భీమయ్య తదితరులు ఉన్నారు.

మానవపాడు మండలంలో..

మానవపాడు : మండలంలోని మద్దూరు, పల్లెపాడు, చెన్నిపాడు గ్రామాల్లో బుధవారం జీవాలకు నట్టల మందుల పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి రాజేశ్‌ తెలిపారు. ఈ మందులు జీవాలకు తాపడం వల్ల జీవాలలో ఆకలి గుణం పెరుగుతూ పోషక విలువలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో చెన్నిపాడు ఎంపీటీసీ స్వాములు, ఆయా గ్రామాల గొర్రెల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

మల్దకల్‌ మండలంలో..

మల్దకల్‌ : మండలంలోని తాటికుంట, మేకలసోంపల్లి, ఎల్కూర్‌, మద్దెలబండ గ్రామాల్లో జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారిణి శిరీషా తెలిపారు.  మొత్తం 3,513 గొర్రెలకు, 225 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర, వెంకటేశ్‌, రాజేంద్ర,రామాంజనేయులు,మధు పాల్గొన్నారు.