ముగిసిన పుష్కరాలు

అయిజ : తుంగభద్ర పుష్కర స్నానంతో భక్తులు పునీతులయ్యారు. పన్నెండ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రంతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర పుష్కరాలకు ముగింపు పలుకుతూ కలెక్టర్, ఎమ్మెల్యేలు తుంగభద్రకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ముగింపు పలికారు.
చివరి రోజు పోటెత్తిన భక్తులు
ఉండవెల్లి : తుంగభద్ర నది పుష్కరాలకు చివరి రోజు పుల్లూరు పుష్కర ఘాట్‌కు భక్తులు భారీగా తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం 13, 786 మంది పుష్కరస్నానాలు ఆచరించిన్నట్లు ఆధికారులు తెలిపారు. 12రోజుల్లో 79,226 మంది పుష్కర స్నానాలు ఆచరించిన్నట్లు పుష్కర ఘాట్ ఇన్చార్జి బాబ్జీరావు పేర్కొన్నారు.
పుష్కరస్నానం ఆచరించిన ప్రముఖులు
పుష్కరాలలో భాగంగా పుల్లూరు పుష్కరఘాట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, రాజేశ్వరి దంపతులు, అనంతపురం జిల్లా ఏఎస్పీ రాఘవ, కడప జిల్లా డీఎస్పీ రాజశేఖర్ పుష్కర స్నానమాచారించి పండితులకు నూతన వస్ర్తాలను, ఫలాలను అందజేశారు. పితృదేవతలకు పిండప్రదానం చేసి నదిలో నిమజ్ఞనం చేశారు. పుష్కరాల చివరి రోజు అధికారులు వేదపండితులు నది హారతి కార్యక్రమాన్ని నిర్వహించి పుష్కరాలకు ముగింపు పలికారు.
అధికారులకు సన్మానం
తుంగభద్రనది పుష్కరాలలో 12రోజులపాటు పనిచేసిన వైద్యసిబ్బందిని, పోలీస్‌సిబ్బందిని, పారిశుధ్యకార్మికులను, విద్యుత్‌సిబ్బందిని, గజ ఈతగాళ్లను, సర్పంచ్ నారాయణమ్మను, ఎంపీటీసీ వరలక్ష్మిని, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును, పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డిని, పరమేశ్వరరెడ్డిని, ఘాట్ ఇన్చార్జీ బాబ్జీరావు, డీఎస్పీ కృష్ణమూర్తి సంయుక్తంగా గ్రామస్తులు సన్మానించారు.
పుల్లూరు, వేణి సోంపురం ఘాట్లను సందర్శించిన కలెక్టర్
ఉండవెల్లి/అయిజ రూరల్ /మల్దకల్ : ఉండవెల్లి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్‌ను, అయిజ మండలంలోని వేణి సోంపురంలోని పుష్కర ఘాట్ కలెక్టర్ శృతిఓఝూ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భాగంగా కలెక్టర్ వేణిసోంపురం ఘాట్ ఇన్చార్జి శ్రీనివాస్, పుల్లూరు ఘాట్ ఇన్చార్జి బాబ్జీరావుతో పుష్కరాలు జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేణిసోంపురం లో సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. వీరి వెంట డీఎస్పీ కృష్ణమూర్తి ఉన్నారు. పుష్కరాల విధుల్లో 12రోజులపాటు ఘాట్ డీఎస్పీగా విధులు నిర్వహించిన డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, సీఐ రామకృష్ణను ఎస్సై జగన్మోహన్ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఆయా కార్యక్రమా ల్లో సర్పంచ్ నర్సోజీ, ఎంపీడీవో సాయిప్రకాశ్, ఎస్సై జగదీశ్వర్, ఎంపీవో నర్సింహారెడ్డి, బ్రాహ్మణ సంఘం నాయ కులు నర్సింగ్‌రావు, మోహన్‌రావు, టీఆర్ఎస్ నాయకులు నర్సింహులు గౌడ్, సునీల్, అధికారులు ఉన్నారు.
కిక్కిరిసిన ప్రసాదాల కౌంటర్లు
ఇటిక్యాల : తుంగభద్రనది పుష్కరాల ముగింపు రోజు మంగళవారం భక్తులు పుష్కర స్నానానికి భారీగా తరలివచ్చారు. పవిత్ర పుష్కరస్నానమాచరించిన అనంతరం భక్తులు అమ్మవారి, స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాలను కొనుగోలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలోని పురావస్తు ప్రదర్శన శాల వద్ద ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు.
భక్తులతో కిటకిటలాడిన పుష్కరఘాట్
అయిజ రూరల్ / మల్దకల్ : పుష్కరాలు చివరిరోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తుంగభద్రకు ప్రత్యే క పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సంతాన వేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. 5,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఘాట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో బ్రాహ్మణులు సామూహికంగా తుంగభద్రకు పూజలు నిర్వహించి సాయంత్రం నదికి హారతి ఇచ్చి ముగింపు పలికారు.
రాజోళి ఘాట్‌లో..
రాజోళి/వడ్డేపల్లి : పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే తుంగభధ్ర పుష్కరాలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. రాజోలిఘాట్ వద్ద ఆలయ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్యకార్మికులు, స్వచ్ఛంధ సంస్థలు, అన్నదాతల సహకారం, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ, ప్రభుత్వ యంత్రాంగం, గ్రామ యూత్ సభ్యుల సహకారాల వల్ల పుష్కరాలు ప్రశాంతంగా ముగిశాయి.
తాజావార్తలు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?