గురువారం 21 జనవరి 2021
Gadwal - Dec 02, 2020 , 02:03:27

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలె

  • ప్రసాద్‌ స్కీంతో జోగుళాంబ ఆలయ అభివృద్ధి
  • ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్‌ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జోగుళాంబ అమ్మవారిని వేడుకున్నట్లు ఎంపీ రాములు తెలిపారు. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా చివరి రోజైన మంగళవారం నదిలో ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి పుష్కర స్నానమాచరించి, స్వామి, అమ్మ వారి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఎం పీ రాములు విలేకరులతో మాట్లాడారు. ప్రసాద్‌ స్కీంతో జోగుళాంబ ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే సహకారంతో పుష్కరాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. కొవిడ్‌ కారణంగా కొంతకాలం అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కూడా నిర్వహించడం లేదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రసాద్‌ స్కీంతో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ పుష్కరాలు విజయవంతంగా ముగిశాయన్నారు.

స హకరించిన అన్ని శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ ని బంధనల మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గానికి ఎంపీ రా ములు గతంలో చాలా నిధులు కేటాయించారని, మార్చి తరువాత మరిన్ని ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాందేవ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ లక్ష్మన్న, జెడ్పీటీసీలు రాజు, శ్రీనివాసులు, ఆలయ మాజీ చైర్మన్లు నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్‌, నాయకులు తేజ, నతానీయోలు, కిశోర్‌, పల్లయ్య, ఆలయ కమిటీ ధర్మకర్త వెంకట్రామయ్యశెట్టి, ఆర్డీ వో రాములు, తాసిల్దార్‌ మదన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo