బుధవారం 20 జనవరి 2021
Gadwal - Dec 01, 2020 , 05:01:34

సినిమా షూటింగ్‌ ప్రారంభం

సినిమా షూటింగ్‌ ప్రారంభం

అయిజ : ఎన్‌వీఆర్‌ క్రియేషన్స్‌లో ‘ఏం చేస్తున్నావ్‌' మూవీ చిత్రాన్ని జిల్లాకు చెందిన యువకులు నిర్మిస్తుండగా, సోమవారం హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో చిత్రం యూనిట్‌ బృందంతో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు క్లాప్‌కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. నడిగడ్డ యువకులు మరెన్నో చిత్రాలు తీసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ చిత్రంలో హీరోగా రాజు, నిర్మాతలు నవీన్‌, కిరణ్‌, కిట్టు, దర్శకత్వం భరత్‌ జాస్మన్‌లు వహిస్తున్నట్లు చిత్రం యూనిట్‌ బృందం తెలిపింది. 


logo