వందలాది మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లో దేన్ని కొనాలన్న సందేహం తీర్చే ప్రయత్నమిది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తానికి, కోరుకుంటున్న రాబడి రావడానికి అవకాశం ఉన్న ఫండ్ల ఎంపిక చాలా ముఖ్యం. అందుకోసం ఈ ఐదు చిట్కాలను పాటిస్తే చాలు.
పనితీరు గతంలో ఎంత రాబడి ఇచ్చిందో చూడండి. అదే సెగ్మంట్లోని ఇతర ఫండ్లతో దాన్ని పోల్చండి. ఇండిపెండెంట్ సంస్థలు ఇస్తున్న రేటింగ్లను పరిశీలించి అత్యుత్తమ ఫండ్లనే కొనుగోలు చేయండి.
రిస్క్ అన్ని రకాల మదుపులపై రాబడితోపాటే రిస్క్ కూడా ఉంటుంది. మీరు ఎంత రిస్క్ భరించగలరో ముందు తెలుసుకోండి. ఆ తర్వాత ఫండ్ కేటగిరిని ఎంచుకోండి.
పోర్ట్ఫోలియో ప్రతి మ్యూచువల్ ఫండ్ వివిధ సాధనాల్లో మదుపు చేస్తుంది. దానిపై వచ్చే రాబడినే పంచుతుంది. అయితే ఆయా ఫండ్లు ఏయే సాధనాల్లో మదుపు చేస్తున్నాయో తెలుసుకోండి. నచ్చితే కొనసాగండి.
మేనేజ్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ఫండ్ మేనేజర్ గత అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ట్రాక్ బాగుంటేనే మదుపు చేయండి.
చార్జీలు ప్రతి ఫండ్ కొనుగోలు, అమ్మకాలపైన చార్జీలుంటాయి. ఎందులో తక్కువగా ఉన్నాయో చూడండి. మనకు రాబడిని ఈ చార్జీలే తీనేస్తాయి మరి.