మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Nov 29, 2020 , 04:43:43

‘నివర్‌' తుఫాన్‌లోనూ భక్తుల పుణ్య స్నానాలు

 ‘నివర్‌' తుఫాన్‌లోనూ భక్తుల పుణ్య స్నానాలు

పుష్కర ఘాట్లకు ఆధ్యాత్మిక శోభ

  • తుంగభద్రమ్మకు జలహారతులు

అయిజ : పుష్కర ఘాట్లకు ఆధ్యాత్మిక మేఘం వర్షించింది. నివర్‌ తు ఫాన్‌ ప్రభావంతో జల్లులు కురుస్తు న్నా భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. తుంగభద్రమ్మ ఒడిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమతల్లికి వాయనాలు సమర్పించడంతోపాటు దీపాలు వెలిగించి జలహారతి పట్టారు. కొవిడ్‌ నిబంధనల పాటిస్తూ భక్తులు పుష్కరాలకు హాజరవుతున్నారు. ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పుష్కరాల్లో 9వ రోజైన శనివారం భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావం ఉన్నా ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చి పుష్కర స్నానాలు చేశారు. నాలుగు పుష్కర ఘాట్లల్లో 19,788 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు .అలంపూర్‌లో 10,907 మంది, పుల్లూరులో 2,313 మంది, రాజోళిలో 5,438 మంది, వేణిసోంపురంలో 1,130 మంది భక్తులు పుష్కరాలకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1,78,023 మంది భక్తులు పుష్కర స్నానాల చేశారు. నదీమ తల్లికి పూజలు చేశారు. అనంతరం సమీపంలోని ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీస్‌శాఖ, ప్రజాప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు. 

కనుల పండువగా నదీహారతి

అలంపూర్‌ : పుష్కరాల్లో భాగంగా అలంపూర్‌ ఘాట్‌ వద్ద శనివారం రాత్రి నదీ హారతిని కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు శాస్రోక్తంగా, సంప్రదాయ రీతిలో శోభాయమానంగా జరిపించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరాజు, ఈవో ప్రేమ్‌కుమార్‌ రావు, ఆలయ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది సత్యనారాయణ, మదనేశ్వర్‌రెడ్డి, సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌, భక్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo