ఎడతెరిపిలేని ముసురు

గద్వాల: నియోజకవర్గంలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి చల్లటి గాలులతో కూడిన ముసురు వర్షం కురువడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోయారు. అసలే చలికాలం కావడం చలికి గాలి, వాన తోడు కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఈ వాతావరణాన్ని తట్టుకోలేక ఎక్కడ రోగాల బారినడతామో అని ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం వరి పంట చేతికి వస్తున్న సమయంలో ముసురు వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముసురు వర్షానికి చేలల్లో పత్తి నల్లబడి పోవడానికి అవకాశం ఉంది. మిరప తదితర పంటలు ఈ ముసురు వర్షానికి దోమ కాటుకు గురి అయ్యే అవకాశం ఉంది.
గద్వాల మండలంలో..
గద్వాల రూరల్: నివర్ తుఫాన్ ప్రభావం వల్ల మండలంలో శుక్రవారం ఉదయం నుంచి చల్లటి గాలులతో ముసురు వర్షం కురుసింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది రైతులు పంటలు కోసి ధాన్యాన్ని కుప్పలు పోసి కవర్లు కప్పారు. మరి కొంతమంది రైతులు వరిపంటలు కోయకపోవడంతో పంట పైర్లు నేల కొరిగాయి. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో వరి పంటలు నెలకొరిగాయి.
గట్టులో మోస్తరు వర్షం
గట్టు : తుఫాన్ కారణంగా గట్టుతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మబ్బులతో కూడి ఉండడంతో చలితీవ్రత బాగా పెరిగింది. ఈ కారణంగా బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా వరికోతలు ఆగిపోయాయి. చేతికొచ్చిన వరిపంటలు దెబ్బతినే అవకాశాలు కనబడుతున్నాయి. వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మకాలు నిలిచిపోయాయి. అధికారుల సూచనలతో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక పొలాల్లో టార్ఫాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు.
మండలంలో ముసరు వర్షం
మల్దకల్ : నివర్ తుఫాన్ ప్రభావం వల్ల మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి ముసురు వర్షం కురుస్తోంది. దీని వల్ల ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వరి పంటలు చాలా వరకు కోత దశలో ఉన్నాయి. ఈ ముసురు వర్షం కురవడంతో పంటలు చాలా వరక దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పత్తి, మిరప పంటలకు ఈ వర్షం వల్ల నష్టం ఉందని రైతులు వాపోతున్నారు.
2 మిల్లీ మీటర్ల వర్షం..
మండలంలో ముసురు వర్షం 2మిల్లీమీటర్ల వర్షం కురిసిందని తాసిల్దార్ ఆజంఅలీ తెలిపారు. అలాగే రైతులు తమ పంటలు కోత తర్వాత ధాన్యం బయట ప్రదేశాల్లో ఉంటే వాటిని టార్ఫాలిన్లతో భద్రపర్చుకోవాల్సి అవసరం ఉందని సూచించారు
నేలకొరిగిన వరిపంట
కేటీదొడ్డి : నివర్ తుఫాన్ ప్రభావంతో కేటీదొడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో ముసురు వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు వర్షం కురుసింది. దీంతో వరిపంటలు నేలకొరిగాయి. వరి పంటలు చేతికి వచ్చే సమయంలో ముసురు వర్షం వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ
- ‘రెడ్’ కలెక్షన్స్..రామ్ టార్గెట్ రీచ్ అయ్యాడా..?
- ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య
- ఉపయోగించని బ్యాంకు అకౌంట్లు మూసేయండిలా!
- తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం : సీఎం కేసీఆర్
- ఆస్ట్రేలియా మాజీలకు అదిరిపోయే పంచ్ ఇచ్చిన అశ్విన్
- మరో క్రేజీ ప్రాజెక్టులో పూజాహెగ్డే..?