మంగళవారం 19 జనవరి 2021
Gadwal - Nov 28, 2020 , 01:40:03

తుఫాన్‌ సైతం లెక్కచేయకుండా..

తుఫాన్‌ సైతం లెక్కచేయకుండా..

  • ఎనిమిదో రోజు 11,653 మంది పుణ్య స్నానాలు
  •   వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు 

అయిజ : నివర్‌ తుఫాన్‌ను సైతం లెక్క చేయకుండా శుక్రవారం ఉదయం నుం చే భక్తులు పుష్కర ఘాట్ల వద్దకు చేరుకున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి, నదిలో దీపాలను వెలిగించి పూజలు చేశారు. నదీమ తల్లికి హారతులు పట్టా రు. నాలుగు పుష్కర ఘాట్ల వద్ద పిండ ప్రదానాలు చేసి పెద్దలను స్మరించుకున్నారు. అనంతరం సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఎనిమిదో రోజు అలంపూర్‌, పుల్లూరు, రాజోళి, వేణిసోంపురం ఘాట్ల వద్ద 11,653 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అలంపూర్‌లో 7,790, పుల్లూరు 1,556లో, రాజోళి 1,639లో, వేణిసోంపురంలో 668 మంది పుణ్య స్నానా లు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,55,501 మంది స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. సమీప రాష్ర్టాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తు న్నారు. అలంపూర్‌ ఘాట్‌ను ఎస్పీ రంజ న్‌ రతన్‌ కుమార్‌ పరిశీలించారు.