కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు

- 8వ రోజు11,653 మంది భక్తుల రాక
- తుఫాన్ సైతం లెక్క చేయకుండా ఘాట్ల వద్దకు..
- దీపారధనతో నదీమతల్లికి ప్రత్యేక పూజలు
పుష్కర స్నానంతో భక్తులు తరించిపోయారు. నివర్ తుఫాన్‌ను సైతం లెక్క చేయకుండా శుక్రవారం ఉదయం నుంచే ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించారు. ఎనిమిదో రోజు 11,653 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అలంపూర్‌లో 7,790, పుల్లూరులో 1,556, రాజోళిలో 1,639, వేణిసోంపురంలో 668 మంది భక్తులు నదిలో మునిగి పునీతు లయ్యారు. దీపాలు వెలిగించి నదిలోకి వదిలారు. కొందరు పిండప్రదానం సమర్పించి పెద్దలను స్మరించుకున్నారు. అనంతరం సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ పుష్కర ఘాట్‌ను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పరిశీలించారు.
- అయిజ/అలంపూర్
అలంపూర్ : తుంగభద్ర నది పుష్కరాల్లో భాగంగా అలంపూర్‌లోని పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి వైభవోపేతంగా నదీ హారతి నిర్వహించారు. ప్రతి నిత్యం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు శాస్రోక్తంగా, సంప్రదాయ రీతిలో నదీమ తల్లికి హారతి ఇస్తున్నారు. కార్యక్రమాన్ని తిలకించి న భక్తజనం పరశించిపోతున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరాజు, ఈవో ప్రేమ్‌కుమార్‌రావు, ఆల య ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం