భక్తి పారవశ్యం

- పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
- తుంగభద్రకు పసుపు, కుంకుమ, వాయనాలు సమర్పణ
అయిజ : నిత్య పూజలు, హోమాలు, నదీ హారతులతో పుష్కరుడు మంత్ర ముగ్దుడవుతున్నాడు. పసుపు, కుం కుమ అందుకున్న తుంగభద్ర చల్లని మనస్సుతో భక్త జనులను దీవిస్తోంది. ఏడో రోజు గురువారం జిల్లాలోని అలంపూర్, పుల్లూరు, రాజోళి, వేణిసోంపురం పుష్కర ఘాట్లలో భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేసి భక్తి పారవశ్యంతో పునీతులయ్యారు. పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించిన కొందరు భక్తులు పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు. ఆయా పుష్కర ఘాట్లను ప్రత్యేకాధికారులు, పోలీసులు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
తులసి మాతకు పూజలు
అలంపూర్ : కార్తీక మాసంలో చిలుకు ద్వాదశిని పురస్కరించుకుని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో తులసి బృందావనం వద్ద అర్చకులు తులసి, ఉసిరి చెట్టుకు కల్యాణం జరిపించారు. కొన్ని ఏండ్లుగా తులసి మాతకు కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి రోజున పూజ నిర్వ హించడం ఆనవాయితీ. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఏసీ శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ చైర్మన్ రవికుమార్ గౌడ్, ఈవో ప్రేమ్‌కుమార్, ధర్మకర్తలు నరసింహారెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, భక్తులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
అలంపూర్ : తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా నదీ స్నానం, ఆలయ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండొద్దని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీనివాసరాజు సిబ్బందికి ఆదేశించారు. పుష్కర ఘాట్‌లో, దర్శన క్యూలైన్లో, ఆలయ పరిసరాల్లో తాగునీటి సౌకర్యం, భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై ఆరా తీశారు. ఘాట్ ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల ఇన్చార్జిల తో మాట్లాడారు. పుష్కరాల సందర్భంగా సీఎం కార్యాలయ మీడియా అడ్వైజర్ సెక్రటరీ సురేశ్ దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ రవికుమార్‌గౌడ్ స్వాగతం పలికారు.
పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
అయిజ రూరల్ /మల్దకల్ : మండలంలోని వేణిసోంపురం పుష్కరఘాట్‌కు గురువారం భక్తులు పోటెత్తారు. చుట్ట పక్కల గ్రామాల నుంచే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తుంగభద్రలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఘాట్ వద్ద దీపాలు వెలిగించి నదిలో ఆర్ఘ్యాం వదిలి సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
మూడు వేల మంది పుష్కరస్నానం
ఉండవెల్లి / మానవపాడు : పుల్లూరు పుష్కర ఘాట్‌లో తుంగభద్ర నదిలో ఏడో రోజు మూడు వేలమంది పుష్కరస్నానాలు ఆచరించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం నుంచి మహిళలు పుష్కరఘాట్‌కు చేరుకొని పుష్కర స్నానాలు ఆచరించారు. అనంత రం గ్రామంలోని ఆలయాలను దర్శించుకుని ప్రత్యే క పూజలు నిర్వహించారు. సాయంత్రం వేదపండితులు నదీ హార తి కార్యక్రమాన్ని శాస్ర్తోతంగా నిర్వహించారు.
పుల్లూరు పుష్కర ఘాట్‌లో నిజామాబాద్ ఎమ్మెల్యే
ఉండవెల్లి : పుల్లూరు పుష్కరఘాట్‌లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా గురువారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి బిగాల కృష్ణమూర్తి అస్థికలను తుంగభద్రనదిలో నిమజ్జనం చేశారు. వీరి వెంట ఎమ్మెల్యే సోదరుడు మహేశ్, నిజామాబాద్ ఏసీపీ రాయల ప్రభాకర్‌రావు ఉన్నారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాలు
ఎర్రవల్లి చౌరస్తా : అలంపూర్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పార్కింగ్ ఇన్చార్జి రవికుమార్ తెలిపారు. మొత్తం 4 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఐపీల కోసం జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పార్కింగ్ పాయింట్ ఏర్పాటు చేశామని, ప్రతి రోజు 700 నుంచి 800 వాహనాలు వస్తున్నట్లు తెలిపారు.
భక్తుల ఆరోగ్యంపై శ్రద్ధ
అయిజ : తుంగభద్ర పుష్కరాలలో భక్తుల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని నాలుగు పుష్కర ఘాట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులు, ఉద్యోగులకు వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేయడం, పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ శాతాన్ని పరీక్షించడం, శరీర ఉష్ణ్రోగతను పరీక్షించడం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి చందునాయక్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను పటిష్టంగా నిర్వహిస్తున్నారు. 6 ఏండ్లలోపు పిల్లలు, 65 ఏండ్ల్ల వయసు పైబడిన వృద్ధులు, గర్భిణులను అనుమతించడం లేదు.
తాజావార్తలు
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
- భయం వద్దు.. బర్డ్‌ఫ్లూ లేదు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
- వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి