సోమవారం 18 జనవరి 2021
Gadwal - Nov 26, 2020 , 02:19:54

బీఈడీ పరీక్షలు ప్రారంభం

బీఈడీ పరీక్షలు ప్రారంభం

వనపర్తి టౌన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రతి కళాశాలకు సెల్ఫ్‌ సెంటర్‌ ప్రకటించగా వనపర్తి జిల్లా పరిధిలో వనపర్తి 4, పెబ్బేర్‌ 2, కొత్తకోటలో 1 మొత్తం ఏడు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 700 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్కులు, శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే పరీక్ష హాల్‌లోకి అనుమతించారు. అదేవిధంగా గురువారం నుంచి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.