మంగళవారం 26 జనవరి 2021
Gadwal - Nov 26, 2020 , 02:19:16

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

గద్వాలటౌన్‌ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భీంనగర్‌లోని గురు రాఘవేంద్రస్వామి ఆలయంలో శ్రీ భూదేవి, లక్ష్మీదేవి సమేతా వేంకటేశ్వర స్వామి నిత్యాకల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణోత్సవం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు , విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా స్వామి వారు సతీసమేతంగా ఊయలపై భక్తులకు దర్శమించారు. logo