గురువారం 04 మార్చి 2021
Gadwal - Nov 26, 2020 , 02:19:13

నేటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు

నేటి నుంచి డీఈఐఈడీ పరీక్షలు

గద్వాలటౌన్‌ : డీఈఐఈడీ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు గురువారం నుంచి వచ్చే నెల 11వరకు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించి బుధవారం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని ఇన్‌చార్జి డీఈవో సుశీందర్‌రావు సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగానే అధికారులకు తెలియజేయాలని కోరారు. 


VIDEOS

logo