గురువారం 21 జనవరి 2021
Gadwal - Nov 24, 2020 , 01:10:46

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

గద్వాల న్యూ టౌన్‌ : జిల్లా పరిధిలోని ప్రజలు కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లార్డ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బీఆర్‌ అబ్రహం సోమవారం ప్రకటనలో తె లిపారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ చాపకిం ద నీరులా విజృంభిస్తున్నందు వల్ల ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, శానిటైజర్‌ వాడాలని ఆయన గుర్తు చేశారు. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం కరోనా వైరస్‌ తీవ్రస్థాయికి చేరుకుంటుం ది. తుంగభద్ర పుష్కరాలకు వెళ్లే ప్రజలు ముందుజాగ్రత్త చర్య గా మాస్కులు, శానిటైజర్లు వెంబడే ఉంచుకోవాలని, కరోనా వ్యాధి గ్రస్తులు పుష్కరాలకు దూరంగా ఉండాలన్నారు. 


logo