శనివారం 28 నవంబర్ 2020
Gadwal - Nov 22, 2020 , 00:58:41

కనుల పండువగా నదీ హారతి

కనుల పండువగా నదీ హారతి

అలంపూర్‌ : పుష్కరాల్లో భాగంగా తుంగభద్ర నదీ తీరంలో అలంపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద ప్రతిరోజూ సం ధ్యా సమయంలో నదీ హారతి కొనసాగించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నిర్వహించిన నదీ హారతి కనుల పండువగా సాగింది. అర్చకులు నదీమ తల్లికి పంచవిద హారతులు సమర్పించారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. మ హోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. పుష్కరఘాట్‌ భక్తులతో నిండిపోయింది. కార్యక్రమంలో ఎండోమెంట్‌ ఏసీ శ్రీనివాసరాజు, ఈవో ప్రేమ్‌కుమార్‌రావు, పాలక మండలి చైర్మన్‌ రవి ప్రకాష్‌గౌడ్‌, ధర్మకర్తలు పాల్గొన్నారు.

‘రాజోళి’ని సందర్శించిన ఎమ్మెల్యే

వడ్డేపల్లి : రాజోళి పుష్కరఘాట్‌ను శనివారం ఎ మ్మెల్యే అబ్రహం, జెడ్పీటీసీ రాజు, సహకార అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, రాజోళి ఉప సర్పంచ్‌ గోపాల్‌, నాయకులు సీతారామిరెడ్డి, మూగెన్న, నతానియోలు సందర్శించా రు. నది వద్ద పూజలు నిర్వహించి భక్తులతో మాట్లాడా రు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వైకుంఠ నారాయణస్వామి దేవాలయంలో పూజలు చేశారు. వైద్యసిబ్బం ది, పోలీసులకు సూచనలు ఇచ్చారు.