శనివారం 23 జనవరి 2021
Gadwal - Nov 20, 2020 , 02:49:12

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ఉధృతి

ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ఉధృతి

అయిజ : ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ఎగువన పంటలు చివరి దశకు చేరుకుంటుండటంతో నీరు అవసరం లేక కర్ణాటక రైతులు నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద ఉధృతి పెరుగుతున్నది. గురువారం ఆనకట్టకు 7,952 క్యూసెక్కు లు ఇన్‌ఫ్లో ఉండగా, 7,400 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 552 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 8.9 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నుంచి కేసీ కెనాల్‌ నీటి వాటా కింద విడుదల చేసే నీరు ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

తుంగభద్రకు తగ్గుతున్న వరద

కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్వల్పంగా చేరుతోంది. గురువారం టీబీ డ్యాంకు 1,198 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదుకాగా, అవుట్‌ఫ్లో 7,230 క్యూసెక్కులు ఉంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల పరిధిలోని ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 90.868 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టాని గానూ 1630.32 నీటి మట్టం నిల్వ ఉంచుతున్నట్లు తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ వెంకట రమణ తెలిపారు. 


logo