శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Nov 19, 2020 , 03:28:47

గద్వాలలో చోరీ

గద్వాలలో చోరీ

  •  12తులాల బంగారం, రూ. 2లక్షల నగదు చోరీ

గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒంటలపేటకు చెందిన తెలుగు విశాలి ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 12తులాల బంగారం నగలు, రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. ఉపాధ్యాయురాలు తెలుగు విశాలి ఉద యం  ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లింది.  దుండగులు తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు నగలు, నగదును ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం భోజన సమయంలో తిరిగి ఇంటికి వచ్చిన విశాలి.. ఇంటి తాళం పగలగొట్టి ఉండడం, బీరువాలో దుస్తులు చిందర వందరగా పడేయడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాం తాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు.  

VIDEOS

logo