గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Nov 18, 2020 , 02:31:15

పీహెచ్‌సీలో కాన్పుల సంఖ్యను పెంచాలి

పీహెచ్‌సీలో కాన్పుల సంఖ్యను పెంచాలి

గద్వాలటౌన్‌ : ఉప్పేరు పీహెచ్‌సీలో కాన్పుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం ఉప్పేరు పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీహెచ్‌సీలో ఇంతవరకు ప్రసవాల సంఖ్య 87శాతం మాత్రమే ఉందని వంద శాతం పెంచాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త నెలకు రెండు కాన్పులను చేయించేలా చూడాలన్నారు. గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధుల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ, డాక్టర్లు సునీత, జయరాజు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo