శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Nov 12, 2020 , 03:18:09

నీళ్లొచ్చినయ్‌...

నీళ్లొచ్చినయ్‌...

  • ఫలించిన భగీరథ యత్నం
  • ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  •  అలంపూర్‌ చివరి ఆయకట్టుకు తుమ్మిళ్ల జలాలు
  • చెరువులు లేకున్నా..కాలువ ద్వారానే నీళ్లు
  • నీటి రాకతో రైతుల్లో ఆనందం

 ఉత్తుత్తి మాటలు చెప్పి.. ఎన్నికల హామీలు చాలాఇచ్చి.. గెలిచాక బోడి మల్లన్న అన్నచందంగావ్యవహరించిన నాయకులనుచూశాం.. కానీ చివరి ఆయకట్టురైతుల గోస విని.. దగ్గరకెళ్లి చూసిచలించి మాట ఇచ్చారు.. సీఎం కేసీఆర్‌మాటకు కట్టుబడి చెరువులు లేకున్నా..కాలువల వెంట నీళ్లు పారించారు.. 2018ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. అలంపూర్‌ చివరిఆయకట్టుకు సాగునీరందించి అపరభగీరథుడయ్యారు. తుమ్మిళ్ల నీళ్ల రాకతో ఆయకట్టు రైతులు జననేతనకు జేజేలుపలుకుతున్నారు.

-మానవపాడు


మానవపాడు : అలంపూర్‌ ని యోజకవర్గంలోని ఆర్డీఎస్‌ ఆయకట్టులోని చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హమీని సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారు. చెరువులు లేకుం డా సాగునీటిని ఎలా అందిస్తారని.. విమర్శించిన వారి నోళ్లు మూయించారు. అలంపూ ర్‌ నియోజకవర్గానికి ఆయువు పట్టు అయిన ఆర్డీఎస్‌ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.., గతంలో కేవలం 30 వేల ఎ కరాలకు మాత్రమే సాగునీరు అందేది. ఈ క్రమంలో చివరి ఆయకట్టు రైతుల కష్టా లు తీర్చేందుకుగానూ రూ.873 కోట్లతో తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశా రు. మొదటి దశగా రూ.173 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. నాటి నుంచి నీటి సరఫరా కొనసాగుతున్నది. అయితే, ఈ ఏడాది వర్షాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో పంట పొలాలకు నీటి ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో అధికారులు తుమ్మిళ్ల మోటర్లను ప్రారంభించడంతో ఐదు రోజులుగా పంట  పొలాలకు నీటి సరఫరా అవుతున్నది. రైతులు రాత్రి పగలు తేడా లేకుండా మిరప, కంది పంటలకు సాగునీటిని వాడుకుంటున్నారు. అనువైన సమయంలో నీటిని అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సమయానుకూలంగా అధికారులు, నాయకులు స్పందించి నీటిని అందించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జూరాల లింకు ద్వారా..

జూరాల లింకు కాలువ ద్వా రా కొన్ని రోజులుగా నీటి సరఫరా చేపడుతున్నారు. మానవపాడు, జల్లాపురం, ఇటిక్యాలపాడు, బోరవెల్లి, పల్లెపాడు గ్రామాల వరకు నీరందుతున్నది. దీంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కా గా నీరు పుష్కలంగా పారుతుండడంతో కాలువలకు అక్కడక్కడా గండ్లు పడ్డాయి. 30 డిస్ట్రిబ్యూటరీ ప రిధిలో కాలువకు గండి పడడంతో నారాయణపు రం గ్రామంలోకి నీళ్లు చేరుకున్నాయి. అధికారు లు వెంటనే స్పందించి గండ్లు పూడ్చి వేశారు. నీటిసరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికాలు ప్రత్యేక వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. 

విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి..

‘ఆఘమేఘాల మీద తు మ్మిళ్ల నిర్మాణం చేపట్టారు. దా ని ద్వారా సాగునీరు ఎలా అందిస్తారు’ అని విమర్శించి న వారికి చెంప పెట్టులా ఉం డేందుకు నాయకులు, అధికారులు సాగునీరు అందిస్తున్నా రు. గతంలో ఎన్నడూ లేనంతగా పంట పొలాలకు నీటి సరఫరా నిరంతరంగా కొ నసాగుతున్నది. పంట పొలాలకు సాగునీటిని పుష్కలంగా వాడుకుంటున్నాం. విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. 

 - సంజీవనాయుడు, రైతు, గోకులపాడు


VIDEOS

logo