ఆదివారం 24 జనవరి 2021
Gadwal - Nov 11, 2020 , 02:15:12

ప్రతి గింజనూ కొంటాం

ప్రతి గింజనూ కొంటాం

తిమ్మాజిపేట : కరోనా కారణంగా ప్రభుత్వ ఆదా యం పడిపోయినా.. సీఎం కేసీఆర్‌ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని రాళ్లచెరువుతండాలో ధాన్యం, మొ క్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అ నంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. గత యాసంగిలో పండించిన ధాన్యాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ కొనుగోలు చేశామని, ఈ సారి కూడా రైతు పండించిన చివరి గింజ వరకూ కొంటామన్నా రు. రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని భరోసా ఇ చ్చారు. ఎవ్వరైనా ఇబ్బందులు పెడితే తనకు ఫోన్‌ చే యాలన్నారు. సన్నరకాలపై ప్రభుత్వం సానుకూలం గా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పడిన తర్వాత రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ప్రస్తుతం ధా న్యం ఏ గ్రేడ్‌కు రూ.1888, మక్కలకు రూ.1850 మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు. రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దనని సూచించారు. అనంతరం ఆవంచ గ్రామంలో రైతు వేదికను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హనుమంతురెడ్డి, డీఎస్‌వో మోహన్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ గమ్లి, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకటస్వామి, ఎంపీటీసీ శాంత, విండో వైస్‌ చైర్మన్‌ రాందేవ్‌రెడ్డి, సీఈవో నరేశ్‌, డైరెక్టర్లు లక్ష్మా, నరేందర్‌రెడ్డి, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


logo