ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మదనాపురం : రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో మార్కెట్ తరఫున చైర్మన్ సాక బాలనారా యణ, రామన్‌పాడు గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యం లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆల హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగా లం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుందన్నారు. మధ్య దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు.
సీడీసీ డైరెక్టర్‌కు సన్మానం
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే ఆల అన్నారు. మండల కేం ద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల బాలకృష్ణను మంగళవారం (కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ) సీడీసీ డైరెక్టర్‌గా నియమిస్తూ, శాలువాతో ఎమ్మెల్యే ఘ నంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తే, పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. అంతరం బాలకృష్ణ మా ట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతను అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే ఆల, మండల నాయకులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ వెంకట్రాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము లు, మహిళా అధ్యక్షురాలు అనురాధ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ హనుమాన్‌రావు, కురుమూర్తి పాల క మండలి సభ్యుడు గోపిస్వామి, సీడీసీ డైరెక్టర్ బాలకృష్ణ, సర్పంచులు సంఘం అధ్యక్షుడు కురుమూర్తి, సర్పంచ్ రాంనారాయణ, కో-ఆప్షన్ సభ్యులు చాంద్‌పాషా, మా ర్కెట్ డైరెక్టర్లు యాదయ్యసాగర్, వెంకటేశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, తిరుపతయ్య, శ్రీకాంత్, పాషా, తిమ్మన్న, నాయకులు మహాదేవన్గౌడ్, సత్యనారాయణ, టీకే కృష్ణ, నాగన్నయాదవ్, హనుమాన్‌రావు, మహదేవన్‌గౌడ్, సత్యనారాయణ, రాములు, సత్యం యాదవ్, రాజవర్దన్‌రెడ్డి, మణివర్దన్, మాసన్న, రవికుమార్ పాల్గొన్నారు.
దళారులను ఆశ్రయించొద్దు
కొత్తకోట : రైతులు దళారులను ఆశ్రయించవద్దని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మం డల కేంద్రంలోని సింగిల్‌విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు విక్రయించిన ధాన్యానికి వారం రోజుల్లో వారి తమ ఖాతాలో డబ్బులు జమ చేయబడుతాయని ఆయన అ న్నారు. అదేవిధంగా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో భవనాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆల అధికారులకు ఆదేశించారు. మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న భవనాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో రూ.5లక్షలతో అదనపు గది నిర్మాణంతో పాటు మరో భవనానికి నిధులు మంజూరు అయ్యాయని, భవన నిర్మాణానికి అడ్డుపడితే వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ వంశీచందర్‌రెడ్డి, మున్సిపాల్ చైర్పర్సన్ సుకేశీని, ఎంపీపీ గుంతమౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌నారాయణ, కౌన్సిలర్ రామ్మోహన్‌రెడ్డి, ఖాజమైనొద్దీన్, రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, విద్యార్థి విభాగం నాయకులు శ్రీనుజీ, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, వహిద్, సుజాత, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉర్దూ టీచర్స్ మద్దతు
- యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం
- స్కామ్ 1992 సెకండ్ సీజన్ ఏంటో తెలుసా?
- దీదీకే మా సంఘీభావం: శివసేన
- ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పలు.. ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి
- ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామని బెదిరింపులు : నటుడి అసిస్టెంట్ బలవన్మరణం