ప్రతి వ్యక్తికి న్యాయ సేవలు సరళతరం

- జూనియర్ సివిల్ జడ్జి ఉషాక్రాంతి
అయిజ : లీగల్ సెల్ అథారిటీ ప్రతి వ్యక్తికి న్యాయ సేవలను సరళతరం చేస్తున్నట్లు జిల్లా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉషాక్రాంతి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో మండల లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజంలో ప్రతి వ్యక్తి తప్పులు చేయడం సహజమని, తప్పులను సరిదిద్దుకున్నప్పుడే సమాజంలో ఉన్నతంగా ఉండటానికి అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో ఫోక్సో కోర్టును ఏర్పాటు చేశామని, సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే ఫోక్సో చట్టం మేరకు కఠిన శిక్షలు విధించేందుకు అవకాశం ఉందన్నారు. పేదలు, మహిళలు, బాలికలు, మానసిక, శారీరకంగా ఎదుగుదల లేని వారికి లీగల్ సెల్ ద్వారా ఉచితంగా న్యాయ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిఒక్క రూ న్యాయ సలహాలను తీసుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, సీనియర్ న్యాయవాదులు సోమశేఖర్, వరలక్ష్మి, ఇక్బాల్, ఎస్సై జగదీశ్వర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపండి
- దారుణం : పెండ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగిక దాడి!
- లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
- సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్
- ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
- 32ఏళ్లుగా రాళ్లు మాత్రమే తింటున్నాడు..ప్రతిరోజూ పావు కేజీ!
- న్యూ లాంఛ్ : 17న భారత మార్కెట్లో షియోమి రెడ్మి టీవీ!
- విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
- మహిళలకు సముచిత ప్రాధాన్యం : ఎమ్మెల్సీ కవిత
- కాంగ్రెస్‌లో ఉంటే జ్యోతిరాధిత్య సింథియా సీఎం అయ్యేవారు..