గురువారం 04 మార్చి 2021
Gadwal - Nov 08, 2020 , 02:02:20

దర్జాగా ధరణి రిజిస్ట్రేషన్లు

దర్జాగా ధరణి రిజిస్ట్రేషన్లు

 ధరూరు: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, సౌలభ్యం కోసం  ప్రవేశపెట్టిన ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడంతో భూముల క్రయవిక్రయాలకు, రిజిస్ట్రేషన్లు సులభతరమయ్యా యి.  15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ఒకే దగ్గర చేసుకునే విధంగా ధరణి పోర్టల్‌ రూపొందించి అమల్లోకి తేవడంతో ప్రభుత్వం ప్రజలనుంచి  మన్ననలు పొందుతుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత ప్రజా స్పందనే అందుకు నిదర్శనమని చెప్పాలి. గతంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి నానా తంటాలు పడేవారు. ఆఫీసర్ల చుట్టూ తిరగాలి, ఊర్లో ఎవరన్నా చాడీలు చెప్తే, ఆరోపణలు చేస్తే ఆఫీసర్లు పని అర్ధాంతరంగా నిలిపి వేసేవారు. ఇప్పుడు అలాంటి అవస్థలేమీ లేవు. కొనడం స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, ఆఫీసులో కూర్చోవడం 20 నిమిషాల్లో పట్టాలు తీసుకోవడమేనని, దర్జాగా కూర్చొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గట్టులో..

గట్టు : గట్టు తాసిల్దార్‌ కార్యాలయంలో శనివారం ఒక రిజిస్ట్రేషన్‌ను తాసిల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుబ్రహ్మణ్యం పూర్తిచేశారు. బలిగెరకు చెందిన బోయ గోవిందమ్మ చిన్న మల్లయ్యకు 1-14 ఎకరాల పొలం విక్రయించగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అరగంటలో పూర్తిచేసి డాక్యుమెంట్‌ లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాన్ని అప్పటికప్పుడే అందజేశారు. ఇంతవరకు 10 రిజిస్ట్రేషన్లు అయినట్లు ఆయన వెల్లడించారు.

మల్దకల్‌లో..

మల్దకల్‌ : మండలంలో శనివారం 9 భూ సంబంధిత రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి నట్లు తాసిల్దార్‌ ఆజంఅలీ తెలిపారు.  రైతులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేశారు.

గద్వాలలో..

గద్వాల రూరల్‌: గద్వాలలో  రిజిస్ట్రేసన్‌ల ప్రక్రియ కొనసాగుతుంది. శనివారం వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న  ఏడుగురు రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసి్ర ధువపత్రాలను తాసిల్దార్‌ సత్యనారాయణరెడ్డి అందజేశారు. ఫింగర్‌ ప్రింట్‌ ద్వారానే కాకుండా ఐరీష్‌ ద్వారా  రిజిస్ట్రేషన్‌ జరుగుతుందన్నారు.

వడ్డేపల్లిలో..

వడ్డేపల్లి : వడ్డేపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా శనివారం ఎనిమిది రిజిస్ట్రేషన్లు జరిగిగాయని తాసిల్దార్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. కర్నూలు ప్రాంతానికి చెందిన ఇద్దరు డాక్టర్లు , వడ్డేపల్లి మండలానికి చెందిన రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  

అలంపూర్‌లో తొలి రిజిస్ట్రేషన్‌

అలంపూర్‌: ధరణి వెబ్‌ మొదలైన తర్వాత అలంపూరు మండలంలో ఐదు రోజులకు మొదటి రిజిస్ట్రేషన్‌ జరిగిందని తాసిల్దార్‌ మదన్‌ మోహన్‌ రావు తెలిపారు. 

ఇటిక్యాలలో..

ఇటిక్యాల: ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొన్న ఆరుగురికి రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తాసిల్దార్‌ శివలింగం తెలిపారు.ధరణి ప్రారంభమైనప్పటి నుంచి  5వ తేదీన రెండు రిజిస్ట్రేషన్లు కాగా శనివారం చేసిన ఆరు రిజిస్ట్రేషన్లతో మొత్తం ఎనిమిది రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు తాసిల్దార్‌ తెలిపారు. 

VIDEOS

logo